జాతియం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు

Chhattisgarh: ఇటీవల జరుగుతున్న తీవ్ర పరిణామాల నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో 41 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ముందు లొంగిపోయారు.

లొంగిపోయిన వారిలో PLGA బెటాలియన్ నెం.1, కంపెనీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, మిలీషియా ప్లాటూన్ కమాండర్లు, డెప్యూటీ కమాండర్, జనతానా సర్కార్ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిపై1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

ఈ 41 మందిలో 39 మంది సౌత్ సబ్-జోనల్ బ్యూరోకు చెందినవారు కాగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణా స్టేట్ కమిటీ, ధమతరి-గరియాబంద్-నారాయణపూర్ డివిజన్‌లకు సంబంధించినవారని పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది బీజాపూర్ జిల్లాలో ఇప్పటివరకు 790 మంది మావోయిస్టులు లొంగిపోయగా, గత 23 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల200 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలి, జనజీవన స్రవంతిలో కలిసారని అధికారులు వివరించారు. మిగిలిన కేడర్ కూడా త్వరలోనే లొంగిపోతుందని ఎస్పీ జితేంద్ర యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button