ఆంధ్ర ప్రదేశ్
Kakinada: స్వీట్ స్టాల్‌లో చెలరేగిన మంటలు

Kakinada: కాకినాడ జిల్లా జగ్గంపేట బస్టాండ్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. బస్టాండ్ వద్ద ఉన్న జైపూర్ స్వీట్ స్టాల్‌లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.



