తెలంగాణ
Hyderabad: తల్లిదండ్రులు మందలింపు.. బిల్డింగ్పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ పరిధిలోని హబ్సిగూడాలో విషాదం చోటుచేసుకుంది. హబ్సిగూడాలోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి చదవుతున్న విద్యార్థిని సిరి వైష్ణవి బిల్డింగ్పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కులు తక్కువవస్తున్నాయి అని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన సిరి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. ‘
సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



