అంగరంగ వైభవంగా అయోధ్యలో ధ్వజారోహణం.. కాషాయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

Ayodhya: అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.అయోధ్య రామమందిరంపై ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ధ్వజారోహణం చేశారు. ముందుగా బాలరాముడికి మోడీ, మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు చేశారు.
అయోధ్యలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు . రామ మందిర నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోడీ, మోహన్ భగవత్ ఆవిష్కరించారు. ఆలయ పనులు పూర్త్తయ్యాయనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు
ఆలయ శిఖరంపై ఎగరేసే ఈ పవిత్ర ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉంది. జెండా మధ్యలో రాముడి ప్రతిభకు, ధైర్యానికి చిహ్నంగా సూర్యుడి బొమ్మ, అలాగే ఓం చిహ్నం, దేవ కాంచనం వృక్షం బొమ్మలు ఉన్నాయి. ఈ ధ్వజం ప్రతిష్ఠ, ఐక్యత, సాంస్కృతిక వారసత్వం, రామరాజ్య ఆదర్శాలకు ప్రతీకగా నిలుస్తుంది.



