తెలంగాణ
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న కొలుసు పార్థసారథి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి. స్వామివారి సన్నిధిలో మనవరాలికి అన్నప్రాసన జరిపించి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి పార్థసారథి.
అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సాంప్రదాయ ప్రకారం ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫొటో అందజేశారు ఆలయ అధికారులు.



