ఆంధ్ర ప్రదేశ్
మా కుటుంబానికి ప్రాణహని.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విజయవాడలో మావోయిస్టులు రెక్కి నిర్వహించి భారీ సంఖ్యలో అరెస్ట్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో మా కుటుంబానికి ప్రాణహని ఉందని చేసిన కీలక వ్యాఖ్యలు కూడా పోలీసుల అలర్ట్‌కు కారణమనే ఊహాగానాలు వస్తున్నాయి.
మావోయిస్టు కీలక నేతలు హిడ్నా సహా భారీ సంఖ్యలో ఎన్‌కౌంటర్ కావడం, మరికొంత నక్సల్స్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు లీకులు వస్తుండటం, పోలీసులు ఖండిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్ర పాలనకు కీలకమైన సచివాలయంలో పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అమరావతి సచివాలయానికి వచ్చే పోయే ప్రతీ ఒక్కరి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.



