ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అందించారు.



