తెలంగాణ
KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్.. ఫార్ములా-ఈ రేసు కేసుపై విచారణకు గవర్నర్ అనుమతి

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేటీఆర్‌పై ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది.
విచారణ తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున్న ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్దిరోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందించారు. కేటీఆర్‌పై విచారణకు అనుమతి ఇచ్చారు.



