తెలంగాణ
Nalgonda: రెండు స్కూల్ బస్సులు దగ్ధం

Nalgonda: నల్గొండ జిల్లా రాయపురంలో కలకలం రేగింది. రెండు స్కూల్ బస్సులు దగ్ధం అయ్యాయి. సెయింట్ ఆన్స్ స్కూల్ ఆవరణలో పార్క్ చేసిన బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.



