ఆంధ్ర ప్రదేశ్
పెళ్లింట్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఓ పెళ్లింట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బంధువులు అందరూ పెళ్లి సంబరాల్లో ఉండగా వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ రెగ్యులేటర్ మారుస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే కుటుంబసభ్యులంతా స్వల్ప గాయాలతో బయటపడంతో పెను ప్రమాదం తప్పింది.



