తెలంగాణ
Hyderabad: ఉరేసుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Hyderabad: భార్యభర్తల మధ్య నెలకొన్న గొడవతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్‌లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పనిచేస్తున్న విశాల్ గౌడ్‌కు నవ్యతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుంచి భార్యభర్తలకు మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి.
ఇటీవల ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో నవ్య తన భర్త విశాల్ గౌడ్‌పై కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే విశాల్ గౌడ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కోడలు నవ్య, అత్తమామ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విశాల్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



