సినిమా
iBomma: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్

iBomma: ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి హైదరాబాద్ వచ్చారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ-బొమ్మ నిర్వహిస్తున్నారు.
ఐ-బొమ్మ వెబ్సైట్ నిండా పైరసీ, ఓటీటీ మూవీలు ఉన్నాయి. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరారు. గత కొంత కాలంగా ఇమ్మడి రవి భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. రవి అకౌంట్లో ఉన్న 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.



