ఆంధ్ర ప్రదేశ్
Chirala: కొవ్వొత్తుల పరిశ్రమలో అగ్నిప్రమాదం

Chirala: బాపట్ల జిల్లా చీరాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కొవ్వొత్తులు తయారీ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే ఉన్న మైనం తగలబడి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో మూడు బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
జనావాస ప్రాంతం కావడంతో మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ప్రాణ హాని జరగకపోవడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.



