సినిమా
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అంజలి, శ్రీనివాస రెడ్డి

Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటి అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డిలు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపలంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకముందు ఆలయానికి వచ్చిన వారికి ఘన స్వాగతం పలకిని ఆలయ అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు.



