తెలంగాణ
Hyderabad: లక్ష ఇవ్వలేదని ఇంటి యజమానిపై హిజ్రాల దాడి!

Hyderabad: నగర వ్యాప్తంగా హిజ్రాలు రెచ్చిపోతున్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు అరాచకం సృష్టించారు. గృహ ప్రవేశం జరిగిన ఇంటికి వెళ్లి లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగిన డబ్బు ఇవ్వనందుకు ఇంటి యజమానిపై హిజ్రాలు దాడికి పాల్పడ్డారు. సదానందం, అతని కుటుంబ సభ్యులపై హిజ్రాలు కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. దీంతో ఇంటి యజమాని సదానందం తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



