తెలంగాణ
నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ బరిలో 58మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుంది. మొత్తం 4 లక్షల ఒక వేయి 365మంది ఓటర్లు ఉన్నారు.
407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్‌కు 17 వందల 61 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్‌ను మానిటరింగ్ చేయనున్నారు.



