తెలంగాణ
సుప్రీంలో కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన బీఆర్ఎస్

తెలంగాణ స్పీకర్‌పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పాటించడంలో స్పీకర్ విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టింది.
కంటెప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంలో దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ ఫైల్ చేసింది.



