సినిమా

జటాధర: హారర్ థ్రిల్!

Jatadhara: సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ సినిమా తాజాగా విడుదలైంది. హారర్, ఫాంటసీ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం శివుడి భక్తులకు బెస్ట్ మూవీ అనే చెప్పాలి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించారు.

వైవిధ్యమైన కథలకు పేరుగాంచిన సుధీర్ బాబు, ‘హరోం హర’ తర్వాత ‘జటాధర’తో హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌ను అందించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ధన పిశాచి పాత్రలో కనిపించారు. ఘోస్ట్ హంటర్‌గా సుధీర్ బాబు నటన క్లైమాక్స్‌లో ఒళ్లు గగుర్పొడిచింది. సోనాక్షి మేకోవర్ ఆకర్షణీయంగా ఉన్నా, ఇంటెన్సిటీ సరిపోలేదు. 21 ఏళ్ల తర్వాత దివ్య కోస్లా కుమార్, 33 ఏళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ మైథాలజీని హారర్‌తో మేళవించారు.

అనంత పద్మనాభ స్వామి ఆలయ సంప్రదాయాలు కథలో భాగమయ్యాయి. సెకండాఫ్ హారర్ సన్నివేశాలు బలంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం, కెమెరా పనితీరు ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం, అనవసర సన్నివేశాలు మైనస్ గా మారాయి. ఎడిటింగ్‌ బాగా చేసుంటే సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యేది. మిగిలిన నటులు పాత్రలకు న్యాయం చేశారు. హారర్, ఫాంటసీ ఇష్టపడే వారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చే అవకాశం ఉంది. సుధీర్ బాబు మరోసారి వైవిధ్య ప్రయత్నంతో ఆకట్టుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button