ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖలు

Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖలు దర్శించుకున్నారు. ఈడీ అధికారి రాహుల్ నవీన్, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, సినీ నటి దివి వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.



