సినిమా

అక్షయ్‌పై 100 కోడిగుడ్ల వర్షం?

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమా కోసం పడిన కష్టాలు అంతా ఇంతా కాదు. ‘ఖిలాడి’ చిత్రంలో 100 కోడిగుడ్లు విసరడంతో శరీరమంతా గాయాలయ్యాయి. వాసన పోవడానికి ఇబ్బంది పడ్డా మాట్లాడలేదు. దీనిపై కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాశ్ ప్రశంసలు కురిపించారు.

సినిమా రంగంలో నటులు పడే శ్రమ అపారం. యాక్షన్ సీన్లతోపాటు కామెడీ సన్నివేశాల్లోనూ రిస్కులు తీసుకుంటారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కు ఓ ఘటన జరిగింది. ఆ ఘటనని ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాశ్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అక్షయ్ డెడికేటెడ్ ఆర్టిస్ట్ అని కొనియాడారు. తనతో 50కిపైగా పాటలు చేశారని, కానీ ఎప్పుడూ స్టెప్స్ మార్చమని అడగలేదని అన్నారు. 1992లో వచ్చిన ‘ఖిలాడి’ సినిమాలో ఓ పాట సీన్‌లో 100 కోడిగుడ్లు విసిరారు. చుట్టూ ఉన్న అమ్మాయిలు గుడ్లు విసరడంతో పగిలి శరీరమంతా అంటుకున్నాయి.

గాయాలయ్యాయి అయినా కానీ అక్షయ్ ఒక్క మాట కూడా అనలేదని అన్నారు. షూటింగ్ ముగిసిన తర్వాత గుడ్ల వాసన పోవడానికి చాలా కష్టపడ్డారట. ఓపికగా భరించారట. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా అక్షయ్ లో ఏమాత్రం మార్పు లేదని అన్నారు. ఇటీవల ‘హౌస్‌ఫుల్’లోనూ అదే ప్యాషన్ కనిపించిందని అన్నారు. ప్రేక్షకుల కోసం ఏ రిస్క్‌కైనా ఆయన సిద్ధం అన్నారు. 10వ అంతస్తు నుంచి దూకమన్నా వెనకడుగు వేయడు అని చిన్నిప్రకాశ్ అక్షయ్ కుమార్ ని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button