తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.



