ఆంధ్ర ప్రదేశ్

మానవత్వానికి నిదర్శనం .. అత్తకు చివరి కర్మలు చేసిన కోడలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. మగదిక్కులేని కుటుంబానికి కోడలు అండగా నిలిచింది. అత్త మరణింతో కలత చెంది కూడా ధైర్యంగా అన్ని కర్మలను స్వయంగా పూర్తి చేసింది కోడలు. చెయ్యేరు గున్నేపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి భర్త కొంతకాలం క్రితం మరణించగా కుమారుడు కూడా ఇటీవల మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో కూరుకుంది. చిన్నపిల్లలతో మిగిలిన ఆ కుటుంబానికి కోడలు శ్రీదేవి అండగా నిలిచింది.

దివ్యాంగురాలైన అత్త ఆది లక్ష్మిని సొంత తల్లిలా చూసుకుంటూ పిల్లలను పోషిస్తూ ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది శ్రీదేవి. అయితే ఆదివారం మధ్యాహ్నం అత్త ఆకస్మికంగా మరణించడంతో అత్త దహన సంస్కారాలు కోడలు శ్రీదేవే పూర్తి చసింది. మగదిక్కు లేని తన కుటుంబానికి అడ్డంగా నిలిచి మానవత్వానికి విలువనిచ్చిన శ్రీదేవి ధైర్యసాహసాలను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button