తెలంగాణ
Bomb Threat: ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు

Bomb Threat: ఇండిగో విమానాలకు తరచుగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో ఇండిగో విమానంలో బాంబులు ఉన్నట్లు బెదిరింపు మెయిల్స్ రావడం.. ఆ తరువాత అదంతా ఫేక్ అని తేలడం జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లుగా మెయిల్ రావడం ఆందోళన కలిగిస్తోంది.
జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాన్ని ముంబాయి ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులకు సెక్యూరిటీ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



