అంతర్జాతీయం

టాంజానియాలో చెలరేగిన హింస.. 700 మంది మృతి

టాంజానియాలో హింస చెలరేగింది. హింసాత్మక ఘటనల్లో 700 మంది మృతి చెందారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమీయా సులూహు హసాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షురాలు తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణిచివేశారని జైలులో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికలు ముగియగా ఆ ఫలితాలను ప్రకటించొద్దంటూ రాజధాని దారే స్సలాంతోపాటు వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. సమీయా సులూహు పోస్టర్లను చింపివేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. హింసాత్మక ఘటనలను నివారించేందుకు సైన్యం రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button