ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రేపు పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

Chandrababu: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరిశీలించారు. పెద్దన్నవారి పల్లి గ్రామంలో సూపర్ సిక్స్ సూపర్ హామీల అమలులో భాగంగా నవంబర్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.



