తెలంగాణ
నేడు అజారుద్దీన్ ప్రమాణస్వీకారం

తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్ అడుగు పెట్టబోతున్నారు. మంత్రిగా అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్‌తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరు కానున్నారు.



