తెలంగాణ
మొంథా తుఫాన్ ఎఫెక్ట్ .. పాలేరుకు పోటెత్తిన వరద

తుపాన్ ప్రభావంతో కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ కు భారీ వరద పోటెత్తింది. సుమారు 20వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.ఎగువన పడుతున్న వర్షాలతో రిజర్వాయర్ కు వచ్చి చేరుతుంది. గత రెండు రోజుల నుండి 24 గేట్లనుండి దిగువకు నీటిని వదులుతుండగా ఫాలింగ్ గేట్ల పక్క ఉన్న సైడ్ వాల్ మీది నుండి కూడా నీరు ప్రవహిస్తూ ఉంది.
ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పడుతున్న వర్షాలకు ఇప్పటికే ఆకేరు మున్నేరు పొంగి ప్రవహిస్తుండగా పాలేరు కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. పాలేరు పరివాహక ప్రాంతాలైనటువంటి కొన్ని గ్రామాలపై అధికారులు దృష్టి సారించి వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు.



