ఆంధ్ర ప్రదేశ్
Montha Cyclone Effect: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

Montha Cyclone Effect: మొంథా తుపాన్ కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
అసహనానికి గురైన ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని రైల్వే అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామంటూ చెబుతున్న అధికారులు వారి కోసం కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు.



