తెలంగాణ

Jupally Krishna Rao: కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు!

Jupally Krishna Rao: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్ర‌గ‌డ్డ డివిజ‌న్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం చేశారు. క‌ళ్యాణ్ న‌గ‌ర్, హైమ‌వ‌తి న‌గ‌ర్‌లో వాకర్స్ మీట్‌లో పాల్గొన్న ఆయన స్థానికులతో కలిసి అల్పాహారం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే నాటికి ధ‌నిక రాష్ట్రంగా ఉండేదని.. కానీ కేసీఆర్ ప్రభుత్వం రూ. 8ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ‌తంలో ఏ సీఎం చేయనన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button