తెలంగాణ

రియాజ్ ఎన్‌కౌంటర్‌ ఘటనపై హెచ్‌ఆర్సీ కేసు నమోదు

నిజామాబాద్ రియాజ్ ఎన్‌కౌంటర్‌ ఘటనపై కేసు నమోదైంది. తెలంగాణ HRCసుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసు నమోదైంది. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో అరెస్టైన రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సర్వీస్ వెపన్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు వివరణ ఇచ్చారు. ఆత్మరక్షణలో కాల్పులు జరిపామని పోలీసులు వాదనలు వినిపించారు. నవంబర్ 24లోగా పూర్తి వాస్తవ నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపికి HRC ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై మేజిస్ట్రేట్ ఇన్వెస్టిగేషన్ వివరాలు ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు, NHRC మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button