తెలంగాణ
Mallu Ravi: దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతుంది

Mallu Ravi: బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతుందని ఆయన విమర్శించారు. దళితులు ఉన్నత స్థానంలో ఉండటం బీజేపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు.
అత్యున్నత స్థానంలో ఉన్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సీజేఐ గవాయ్‌పై బూట్లతో దాడి చేయడం అమానుషమని అన్నారు. మోడీ ప్రభుత్వంలో కుల, మతాలలో చిచ్చులు రేపుతున్నారని మండిపడ్డారు.



