ఆంధ్ర ప్రదేశ్
నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు

నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలలకు పిలుపునిచ్చింది. నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ ఆందోళనలు చేపట్టనుంది. నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని వైసీపీ మండిపడింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనుంది. నకిలీ మద్యం రాకెట్లో ఉన్న వారందర్నీ అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలకు పిలుపునిచ్చింది వైసీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలపీఠంపై పెట్టడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతుంది.



