బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే… స్థానిక ఎన్నికలకు బ్రేక్

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల అమలు పైన సుదీర్ఘ వాదనల తరువాత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9న హైకోర్టు స్టే విధించింది. ఈ జీవో ఆధారంగా జారీ చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధిస్తూ నిర్ణయించటంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. హైకోర్టు ఉత్తర్వుల పై ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రభుత్వం ఏం చేస్తుందనేది కీలకంగా మారుతోంది.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చింది. రిజర్వేషన్ల అంశంపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. నోటిఫికేషన్‌పై సైతం హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
తదుపరి చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎలా ముందుకెళ్లాలి, బీసీ వర్గాలను ఎలా బుజ్జగించాలని లీగల్ టీమ్‌తో ప్రభుత్వం సుధీర్ఘ మంతనాలు చేస్తుంది. ప్రభుత్వం సీనియర్ న్యాయవాదుల సలహాలు తీసుకుంటుంది. సర్కార్ బీసీ నేతలు, మంత్రులు సలహాలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా ప్రణాళిక రూపొందిస్తుంది.
ఇదే సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల పైన ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. ఎలాగైనా కోర్టులో గెలుస్తామని ప్రభుత్వంలోని మంత్రులు చెబుతూ వచ్చారు. ఇదే సమయంలో కోర్టు తీర్పు పైన న్యాయ నిపుణులతో మంత్రులతో చర్చిస్తున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల పైన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం.
రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ పూర్తిగా వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టులో పిటీషన్ల దాఖలు సమయంలో హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో పిటీషన్ తిరస్కరించింది. ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్దం అవుతుంది.



