ఆంధ్ర ప్రదేశ్

జగన్ ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు డీఎస్సీ అభ్యర్ధులు డీఎస్సీ 2025 రద్దుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీకి రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్ తో పరీక్ష నిర్వహించాలని కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందన్నారు. డీఎస్సీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దుచేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్ధుల విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button