అంతర్జాతీయం

America: వాషింగ్టన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ( GTA) వారి ఆధ్వర్యంలో సోమవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలంతా ఒకే చోటకలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా కుడా మాజీ చైర్మన్ ,ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబిసి చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని గుర్తు చేశారు.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మహిళలు లాయబద్ధమైన రాగాయుక్తమైన బతకమ్మ పాటలతో ధూంధాం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని మన సంస్కృతి బతుకమ్మ పండుగను విదేశాలలో ఇంత వైభవంగా ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మహిళలంతా కలిసి తెలంగాణ సంస్కృతితో పాటు బతుకమ్మ ఆటపాటలతో నృత్యాలు చేస్తూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నారని సుందర్ రాజ్ యాదవ్ ప్రశంసించారు.

తెలంగాణ మహిళలు జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ ఆ బతుకమ్మ పండుగను ఖండాలు దాటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా దూర దేశాలలో కూడా తెలంగాణ సంస్కృతి ప్రతి ధ్వనిస్తుందని చెప్పారు. ఈ బతుకమ్మ నిర్వాహకులు ఉచిత భోజనం షాపింగ్ మాల్ బెస్ట్ బతుకమ్మల బంగారం బహుమతులను కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు గ్లోబల్ ఇలా పలు ఆసక్తికరమైన ఈవెంట్లను నిర్వహించడం ఎంతో ఆనందానికి ఇచ్చిందని చెప్పారు.

ప్రవాస తెలంగాణీయుల సాంస్కృతిక చైతన్యాన్ని అభినందించారు. డప్పు, కోలాటాలతో బతుకమ్మ ప్రాంగణం మరింత వైభవంగా మారింది. అందమైన బతుకమ్మలు, నాట్యం చేసిన మహిళలు, చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశాల్లో కూడా బతుకమ్మను ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button