Bhatti Vikramarka: గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ చారిత్రాత్మకం

Bhatti Vikramarka: తక్కువ కాలంలో వందల మందికి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించిందని, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని డిప్యూటీ సీఎం అన్నారు. పది సంవత్సరాలు పరిపాలించిన వారు ఒక్కసారి కూడా గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, గత ప్రభుత్వ పెద్దలు గ్రూప్ వన్ నియామకాలపై తప్పుగా మాట్లాడి కోర్టు దాకా తీసుకువెళ్లారని అన్నారు. పారిశుద్ధ కార్మికులు, పంచర్లు వేసుకునే వారి బిడ్డలు, పేద రైతులు, రోజువారి కూలీల బిడ్డలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదిస్తే వారి కష్టాన్ని అవహేళన చేసే విధంగా కొద్దిమంది మాట్లాడటం బాధాకరంగా ఉంది అన్నారు.
చేసిన పనులు చెప్పుకునే సాంప్రదాయం కాంగ్రెస్ ప్రభుత్వాలకు లేదు పనులు చేసుకుంటూ ముందుకు పోవడమే తెలుసు కానీ కొన్ని ప్రభుత్వాలు ఏమి చేయకుండానే ప్రచారాలతోనే బతికేస్తాయి అన్నారు. ఏమి చేయకుండానే అన్నీ చేసినట్లు భ్రమలు కల్పించి ప్రజలను ఆ భ్రమల్లో ఉంచి అన్నీ పూర్తి చేశామని ప్రచారం చేసుకుంటారని వివరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుంటే ఒంటరి చిన్న గది ఎవరికి సరిపోతుంది, అల్లుడు వస్తే ఎట్లా మేం అధికారంలోకి వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని పెద్దమనిషి చెప్పడంతో ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారు అని అన్నారు. 10 సంవత్సరాల పాటు శాసనసభలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి అడిగితే కట్టకుండానే, పంచకుండానే 90 శాతం ఇల్లు పంపిణీ చేశావని ప్రకటనలు చేశారు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేశామని చెప్పుకున్నారని వివరించారు.
ప్రజల దీవెనతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్లలాగా లేదు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలోపే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి 70 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, గ్రూప్ వన్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి నియామకం చేపట్టామని తెలిపారు. ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నేర్పిస్తాం అంటే నోరు వెళ్ళబెట్టారు. సంవత్సరాల కాలంలోనే సర్వే చేసి నిజమైన పేదలకు ఇల్లు నిర్మిస్తున్నాం. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 22, 500 కోట్లు ఖర్చు చేస్తున్నవని తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద కుటుంబం ఉండరాదు అనేది మా ప్రభుత్వ ఆలోచన అన్నారు.
రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుంటే అభినందించాల్సింది పోయి సక్రమంగా జరగడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబం బాధ్యత మాదే అని డిప్యూటీ సీఎం అన్నారు. పేదలకు జరిగే మేలును రాజకీయ పార్టీలు తమ ఉనికి కోసం అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలి ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిందేనని కానీ జరిగే పనిని జరగడం లేదు అన్నట్లు ప్రచారం చేసి గందరగోళం సృష్టించవద్దు అన్నారు.
100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి లేదంటే పాదయాత్ర చేస్తామని మధుర పట్టణంలో ఓ పెద్దాయన ప్రకటించారు. ప్రకటన చేసే ముందు వారికి కనీసం తెలియాలిగా 100 పడకల ఆసుపత్రి ప్రారంభించి సంకలు గుద్దుకుంటే కాదు నిధులు కేటాయించాలి టెండర్లు విలవాలి స్టాఫ్ ను రిక్రూట్మెంట్ చేయాలి అప్పుడే రోగులకు మేలు జరుగుతుంది పనులు పూర్తి చేయకుండా ఆసుపత్రిని ప్రారంభించడం సరే ఇది కాదు అన్నారు.
ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రతిరోజు రాష్ట్రంలో నేను ఎన్ని పనులు చేస్తానో మధుర నియోజకవర్గం లో దశాబ్ద కాలంగా నిలిచిపోయిన పనుల పూర్తికి అదే రీతిలో కష్టపడతానని అన్నారు. మధుర నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ప్రతి రోజు ఒక గంట సమయం కేటాయించి సమీక్షించి ఆ తర్వాతే నిద్రపోతాను. మధుర నియోజకవర్గంలో చేపట్టిన పనులు ఎక్కడిదాకా వచ్చాయి ఎక్కడ నిలిచిపోయాయి కారణాలు ఏంటో తెలుసుకొని పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాను, వారితో ప్రతిరోజు సమీక్షిస్తుంటాను అని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా మధురి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి కాగానే మధురలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అభివృద్ధి చేసుకుందాం ఎన్నికల అప్పుడు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకొని ప్రజలను ఓట్లు అడుగుదామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు జరుగుతాయి ఇది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అందుకే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని తీసుకురాగలిగింది అన్నారు.
ఇతర పార్టీ నాయకులు చెప్పేది ఒకటి చేసేది మరొకటి కానీ మధిర ఎమ్మెల్యే ఏది చెప్తాడో అదే చేస్తారు అని నారాయణపురం ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మధుర నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, గ్రంథాలయ ఉద్యమం వంటి వాటికోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప చరిత్ర మధుర కి ఉంది ఈ నియోజకవర్గం ఆశామాషి నియోజకవర్గం కాదు అన్నారు.
అనేకమంది నవ యువకులు ప్రాణత్యాగం చేయడంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజల డిమాండ్ ను అర్థం చేసుకొని అవసరమైన బలం లేకున్నా శ్రీమతి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రజల మేలు కోసం ప్రజా ప్రభుత్వం ప్రణాళిక అబద్ధంగా పనులు చేసుకుంటూ ముందుకు పోతుందని తెలిపారు. 21 వేల కోట్ల రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు జమ చేసాం. రాష్ట్రంలో 1.95 కోట్ల కుటుంబాలు ఉంటే 96 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం దేశంలోని ఏ రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరగడం లేదు అన్నారు. గతంలో రేషన్ షాపుకు బియ్యం రాగానే వాటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వారు అని గుర్తు చేశారు.
పేదలకు సన్న బియ్యం పంపిణీ కోసం 13500 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నాం సన్నధాన్యం సాగు చేసే రైతులకు 500 బోనస్ ఇస్తున్నట్టు తెలిపారు. నారాయణపురం గ్రామంలో 455 విద్యుత్ మీటర్లు ఉండగా 365 మంది 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారని తెలిపారు. మీ అందరి పక్షాన ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకు ప్రతి సంవత్సరం కేవలం నారాయణపురం గ్రామస్తుల పక్షాన 33.60 లక్షల రూపాయలు చెల్లిస్తున్నాం అన్నారు. గోదావరి కృష్ణ నదిపై పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. నీళ్లు పారితేనే గ్రామాలు పచ్చగా ఉంటాయి రైతులు కూలీలు బాగుంటారు గ్రామం బాగుంటేనే విద్య వైద్యం అన్ని రంగాలు బాగుంటాయని అన్నారు.
10 సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. లక్ష కోట్లతో కట్టిన కాలేశ్వరం కళ్ళముందే కూలిపోయింది అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు వనరులు కొల్లగొట్టి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తే తమ ప్రభుత్వం ఆర్థిక పాలన సంక్షేమ వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రణాళిక అబద్ధంగా ముందుకు పోతుందని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా సిద్ధం చేయాలని ఆలోచనతో ఉరుకులు పరుగులతో యావత్ క్యాబినెట్ పనిచేస్తుంది అన్నారు. మధుర నియోజకవర్గంలో ప్రతి నాయకుడు ఒక ఎమ్మెల్యేగా భావించి ఏ పనులు కావాలో తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.
గత పది సంవత్సరాలు అధికారం లేకపోయినా అధికారులు వేధించిన ఏదో ఒక రోజు అధికారం వస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని భావించి తనతో పాటు నడిచిన అందరూ తనకు గుర్తు ఉన్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ముందు తాను మొదటి నియోజకవర్గం అంతా పాదయాత్ర చేశాను ఈ నియోజకవర్గంలో ప్రతి అంగుళం తనకు తెలుసు అన్నారు. ఈ నాయకుడు ప్రజల కోసం పనిచేస్తారు, ఎవరి పనితీరు ఏంటి, ఈ గ్రామంలో గుడి బడి ఎత్తిపోతల కరెంటు ప్రతి సమస్యను తాను రాసుకొని వాటిని తూచా తప్పకుండా పరిష్కరించేందుకు ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంటారని డిప్యూటీ సీఎం తెలిపారు.



