ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యే బాలకృష్ణపై అంజాద్ బాషా ఫైర్

Amzath Basha: సినీ నటుడు , హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ పై వైసీపీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. పవిత్రమైన దేవాలయం లాంటి శాసనసభ లోకి ఆయన మద్యం సేవించి వచ్చినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి వాడు వీడు అనడంతో పాటు సైకో అనడం ఆయన అసలు వ్యవహారాన్ని బయట పెట్టిందన్నారు.

రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఐదేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నేతపై అవాకులు చవాకులు పేలడం సరికాదన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలను అమల్లోకి తెచ్చారని గుర్తుచేశారు. అసెంబ్లీలో బాలక్రిష్ణ ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి పై సైతం ఇష్టానుసారంగా మాట్లాడి తన విచ్చలవిడి తనాన్ని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button