ఆంధ్ర ప్రదేశ్
Bhumana: బాలకృష్ణకు పిచ్చి పట్టింది

Bhumana: జగన్ మాటల మనిషి కాదు చేతల మనిషి అన్నారు వైసీపీ చిత్తూరు జిల్లా ఇంచార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి . గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించాలనే మంచి ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్టును ప్రారంభించారని చెప్పారు. బాలకృష్ణకు 20 ఏళ్ల క్రితమే పిచ్చి పట్టిందని ఆయన బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మకథలోనే చెప్పారని అన్నారు.
బాలకృష్ణ తప్పతాగి మాట్లాడారని విశ్లేషకులు అంటున్నారని చెప్పారు. అటు గ్రానైట్ మాఫియా చిత్తూరు జిల్లాలో పెట్రేగిపోతుందని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి సాగు అధికం అయ్యిందని. 100 కేజీల గంజాయితో కుప్పం జనసేన నాయకుడు పట్టుబడ్డాడని చెప్పారు.



