తెలంగాణ
Basara: స్కందమాత అలంకారంలో సరస్వతీ అమ్మవారు భక్తులకు దర్శనం

Basara: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం శుభదినం కావడంతో పాటు, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5 వ రోజు స్కందమాత అలంకారంలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజామున చతు షష్టి పూజలు , అనంతరం పెరుగన్నంను ఆలయ వేదిక బృందం నైవేద్యంగా సమర్పించారు.
తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తున్నారు. ధర్మాబాద్ వ్యాపార, వర్తక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కొనసాగుతోంది.



