తెలంగాణ

Jagadish Reddy: బండి సంజయ్‌వి చిల్లర మాటలు

Jagadish Reddy: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్‌వి చిల్లర మాటలు అంటూ మండిపడ్డారు. ఆయన కార్లు ఏ షోరూంలో కొనుగోలు చేశారో కేటీఆర్ కూడా అక్కడే కొనుగోలు చేశారని చెప్పారు. సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారు. ఇదేనా బండి సంజయ్‌ గొప్పగా కనిపెట్టింది అని విమర్శించారు. అయితే అంతకుముందు కేటీఆర్‌పై బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు.

బీఆర్ఎస్‌ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కి పలు ప్రశ్నలు సంధించారు. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని బండి సంజయ్ నిలదీశారు. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ప్రశ్నించారు.

మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? అని బండి సంజయ్‌ అన్నారు. ఇందులో నిజాలు బయటకు రావాలని, సంబంధిత శాఖలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో బండి సంజయ్ కామెంట్స్‌కు జగదీష్ రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button