అంతర్జాతీయం

పాకిస్థాన్ ఆర్మీకి మరోసారి ఘోర అవమానం

Pakistan Army: చిన్న తిరుగుబాటు దళం అనుకుంటే పాక్‌కు పక్కలో బల్లెంలా మారింది బలూచిస్థాన్ ఆర్మీ. వరుస దాడులకు దిగుతూ మన శత్రుదేహానికి చుక్కలు చూపిస్తోంది. బీఎల్ఏ దెబ్బకు పాక్ ఆర్మీ పరుగులు పెడుతోంది. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ఘోర అవమానం జరిగింది. 500 మంది పాక్ ఆర్మీ తమ కాళ్లపై పాకుతూ బీఎల్ఏకు లొంగిపోయారు.

అంతేకాదు అగ్రరాజ్యం సైతం బలూచ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో తమ జోలికి వస్తే ఇదే రిపీట్ అవుందని బలూచ్ హెచ్చరిస్తోంది. ఇంతకీ పాక్‌పై బీఎల్ఏ చేసిందేంటి..? పాకిస్తాన్‌కు ఎలా బుద్ధి చెబుతోంది..? ఇప్పుడెందుకు అమెరికా బలూచ్‌కి సపోర్ట్ చేస్తోంది..?

మన శత్రుదేశం పాకిస్థాన్‌కు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. వరుస దాడులకు దిగుతూ పాక్ సైన్యాన్ని ఊచకోత కోస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి ఘోర అవమానం జరిగింది. బీఎల్ఏ దెబ్బకు పాక్ ఆర్మీ పరుగులు తీసింది. దీంతో 500మంది పాక్ జవాన్లు బీఎల్ఏ ముందు మోకరిల్లారు. కాళ్లపై పాకుతూ బీఎల్ఏకు సరెండర్ అయ్యారు. ఇప్పటికే స్వతంత్ర్య దేశంగా బలూచ్ ప్రకటించుకుంది. అయితే బీఎల్ఏను అణిచివేసేందుకు పాకిస్తాన్ భారీగా సైన్యాన్ని పంపుతుంది.

కానీ ప్రతిసారి ఓటమితోనే పాక్ వెనుదిరుగుతుంది. బీఎల్ఏ దెబ్బకు ఇప్పటికీ పలుమార్లు ఆర్మీ పారిపోయింది. తాజాగా మరోసారి 500మంది లొంగిపోయారు. ఇది పాక్ ఆర్మీ చీఫ్ సిమ్‌ను మునీర్‌కు ఘోర అవమానమే. తమ జోలికి వస్తే ఇదే రిపీట్ బలూచ్ కుండబద్దలు కొట్టి చెబుతోంది.

ఇప్పటికే బలూచ్ ఆర్మీ దాడుల్లో ఎంతో మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ భద్రతా దళాలు బలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో 10మంది బీఎల్ఏ వేర్పాటు వాదులు హతమయ్యారని పాక్ ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే, పాకిస్తాన్ ఆర్మీని, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని బీఎల్ఏ గతంలో ఇటువంటి దాడులకు పాల్పడింది. మార్చిలో క్వెట్టా నుంచి పెషావర్ కు 440 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బీఎల్ఏ వేర్పాటు వాదులు హైజాక్ చేశారు. ఇందులో 21మంది పౌరులు, నలుగురు సైనికులు మరణించారు.

తాజాగా మరోసారి పాక్ సైన్యంపై బలూచ్ ఆర్మీ దాడులకు పాల్పడింది. క్వెట్టా, కలాత్‌లో దాడులు చేసింది. ఈ దాడుల్లో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ముందుగా కలాత్‌లో సైన్యాన్ని తరలిస్తున్న బస్సుపై బలూచ్ ఆర్మీ దాడికి దిగింది. ఇందులో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత క్వెట్టాలోని హాజర్‌గంజ్‌లో ఐఈడీ బాంబు పేల్చి మరో ఇద్దరు సైనికులను చంపేసింది. ఈ విషయాన్ని బీఎల్ఏ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చనిపోయిన వారిలో మేజర్ స్థాయి అధికారులు ఉన్నారు.

అలాగే.. బలుచిస్తాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఈనెల 9 న ఘోరమైన సైనిక దాడి జరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీఓ సైనిక కారును లక్ష్యంగా చేసుకుని భారీ దాడి నిర్వహించింది. ఈ దాడిలో 14 మంది పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా గత కొంత కాలంగా బీఎల్ఏ దాడుల్లో పాక్ భారీగా సైన్యాన్ని నష్టపోతుంది.

జనవరి – జూన్ మధ్య బీఎల్ఏ మొత్తం 286 దాడులకు పాల్పడింది. ఇందులో 9 స్పెషల్ ఆపరేషన్లు, 3 ఆత్మహుతి దాడులు ఉన్నాయి. ఈ దాడుల్లో 697మంది పాక్ సైనికులు మరణించారు. మరో 290 మంది సైనికులని బీఎల్ఏ నిర్భంధించింది. పాక్‌కు చెందిన 133 వాహనాలను ధ్వంసం చేసింది. ట్రైన్ హైజాక్ తో పాటు 17 సైనిక స్థావరాలను దెబ్బతీసింది. పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది బలుచిస్తాన్‌లో స్వాతంత్ర్య సాధన కోసం పోరాడుతున్న ఒక దళంగా ఉంది. వారు పాకిస్థాన్ ప్రభుత్వం పై సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమస్యలకు ప్రతీకగా ఉన్నారు. బలూచిస్తాన్ ప్రాంతంలో గుంపులుగా ఉద్యమిస్తూ, స్వతంత్ర రాష్ట్రం కోసం ఆందోళనలు చేపడుతున్నారు. BLA బలంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ, పాకిస్థాన్ సైన్యం, పోలీస్ సంస్థలపై దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడి BLA ప్రారంభించిన ఆపరేషన్ హీరోఫ్.

2 అనే విస్తృత ఆపరేషన్‌లో భాగంగా జరిగింది. మే 12 నుండి 14 వరకు ఈ ఆపరేషన్ విస్తృత స్థాయిలో కొనసాగింది. బలూచిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో BLA దాడులు నిర్వహించింది. కచ్చీ జిల్లాలో పాకిస్థాన్ సైనిక కారువుపై ఐఈడి పేలుడు, ఇది 14 మంది సైనికుల మృతికి కారణమైంది. పంజ్గూర్ లో సైనిక స్థావరంపై BLA దాడి, అందులో 2 సైనికులు మృతి చెందారు, 5 మంది గాయపడ్డారు.

అయితే గతంలో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీదాని అనుబంధ మజీద్‌ బ్రిగేడ్‌లను ఉగ్రసంస్థలుగా ప్రకటించాలని యూఎన్‌ భద్రతామండలిలో చైనా, పాక్‌ ఉమ్మడి బిడ్‌ను సమర్పించాయి. ఐఎస్‌ఐఎల్‌-కె, అల్‌ఖైదా, తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌, బలోచ్‌ దాని అనుబంధ మజీద్‌ బ్రిగేడ్‌ వంటి ఉగ్రవాద సంస్థలు అఫ్గాన్‌ కేంద్రంగా పనిచేస్తున్నాయని పాక్‌ రాయబారి అసిమ్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ తెలిపారు.

అక్కడ దాదాపు 60కి పైగా ఉగ్రవాద శిబిరాలు సీమాంతర దాడులకు పాల్పడుతున్నాయన్నారు. వారి ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ జాబితాపై తగిన నిర్ణయం తీసుకోవాలని భద్రతా మండలిని కోరారు.ఇటీవల కాలంలో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ పాక్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. పలు ఆత్మాహుతి దాడులను సైతం నిర్వహించింది.

తాజాగా బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీని ఉగ్రసంస్థగా గుర్తించాలని ఐరాస భద్రతా మండలిలో పాక్‌, చైనా చేసిన ప్రతిపాదనను అమెరికా అడ్డుకుంది. బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీని ఉగ్రసంస్థగా గుర్తించడానికి ఆధారాలు అసంపూర్ణంగా ఉన్నాయంటూ ఐరాస భద్రతా మండలిలో ఈ ప్రతిపాదనను యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌ అడ్డుకున్నాయి. అయితే బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ అగ్రరాజ్యం ఇటీవల కీలక ప్రకటన చేసింది.

అయితే అందుకు విరుద్ధంగా ఐరాసలో పాక్‌, చైనా ప్రతిపాదనను అడ్డుకున్నారు. కాగా పాక్‌లోని అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న ప్రావిన్స్‌గా బలోచిస్థాన్‌ ను పేర్కొంటారు. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో తమను పాకిస్తాన్ అణిచివేయాలని చూస్తుందని చిత్రహింసలు పెడుతుందని బలోచ్ చెబుతోంది. దీంతో తమకు ప్రత్యేక దేశం కావాలని బలోచ్‌ ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. మరి దీనికోసం కూడా అమెరికా ప్రయత్నాలు చేస్తుండొచ్చు.

ఒక చిన్న దళం చేతిలో పాక్ ఇంత స్థాయిలో నష్టపోవడం గమనార్హం. అదే సమయంలో మెరుగైన కార్యాచరణ, సమన్వయంతో బీఆఎల్ఏ దూసుకపోతుంది. అంతేకాకుండా 45 ప్రాంతాలను పాక్ ఆర్మీ నియంత్రణ నుంచి స్వాధీనం చేసుకుంది. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ కార్యాచరణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు సరఫరా మార్గాలు, కమ్యూనికేషన్, సైనిక లాజిస్టిక్‌లకు అంతరాయం కలిగించడంపై బీఎల్ఏ ఎక్కువ ఫోకస్ పెట్టింది.

17 సైనిక స్థావరాలను నాశనం చేసి, విస్తృతమైన ఆయుధ నిల్వలను స్వాధీనం చేసుకోవడం బలూచ్‌లో వారి పట్టు ఏ విధంగా ప్రపంచానికి చూపించింది. ఇక పాకిస్థాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఏడుగురు ఫిదాయీన్ యోధులతో సహా 36 మంది బీఎల్ఏ యోధులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ మాత్రం బీఎల్ఏ దాడులను బయటకు తెలియకుండా ఎక్కడికక్కడ రహస్యంగా ఉంచుతుంది. బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆ దేశం భయం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button