ఆంధ్ర ప్రదేశ్

AP Politics: మెడికల్ కాలేజీల చుట్టూ ఏపీ రాజకీయం

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కళాశాలలపై తెలుగుదేశం – వైఎస్ఆర్సీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది.మెడికల్ కళాశాలల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతుంది. మెడికల్ కళాశాలలను ప్రైవేటైజేషన్ చేయాలని ప్రభుత్వం చూస్తుందని వైఎస్సార్సీపి ఆరోపిస్తుంది. ప్రభుత్వం మాత్రం పబ్లిక్ , ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా నిర్వహించాలని యోచిస్తుంది. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నంద్యాలలో మెడికల్ కళాశాల వేదికగా రాజకీయ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.

మెడికల్ కళాశాలలపై నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి హాట్ కామెంట్ చేశారు.నంద్యాల మెడికల్ కళాశాల పునాదులు లేవని హోంమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఒకటిన్నర సంవత్సరం అయినా కాలేజ్ గేటుకు బోర్డు కూడా పెట్టలేదని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ లు తానే ప్రారంభించానని సీఎం చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. కూటమి ప్రభుత్వంపై ఎవరికీ నమ్మకం లేదనీ మళ్ళీ తామే అధికారం లోకి వస్తామంటున్నారు.

కాలేజ్ లను పూర్తి చేస్తామన్నారు. పులివెందులలో మెడికల్ కళాశాలను ఎందుకు వద్దంటున్నారో టీడీపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజ్ లకు శంకుస్థాపన చేసి,అందులో ఐదు కాలేజ్ లను ప్రారంభించామని ఈ ఏడాదిన్నర కాలంలో కూటమి సర్కారు ఏం చేసిందో….? చెప్పాలని ప్రశ్నిచారు.

అటు టీడీపీ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి మెడికల్ కళాశాలలపై వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. శిల్పా రవి ఆరోపణలపై భూమా జగత్ విఖ్యాత్ ఘాటుగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికి మెడికల్ కాలేజ్ మీద పూర్తిగా అవగాహన లేదన్నారు. శిల్పా రవి సండే సండే నంద్యాలకు వచ్చి వెళ్ళడం కాకుండా వారంలో ఏడు రోజులపాటు నంద్యాలలో ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుస్తోందని అన్నారు. నంద్యాల మెడికల్ కాలేజీని ఎవరూ పీపీపీ పద్ధతిలో తీసుకోవట్లేదని రాష్ట్రంలో 30శాతం కూడా పూర్తికాని మెడికల్ కాలేజీలను పిపిపి పద్ధతిలో కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

అయితే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు.వీటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి, మరికొన్నింటి నిర్మాణం కొనసాగుతోంది. జగన్ పాలనలో విద్య, వైద్యాన్ని ప్రజలకు తక్కువ ఖర్చుతో అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు చేపట్టారని వైసీపీ వాదిస్తోంది. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి మెడికల్ కాలేజీలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button