తెలంగాణ
గోదావరిలో చిక్కుకున్న కూలీలు

ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వెంకటాపురం మండలంలోని గోదావరి పాయలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ వరద ప్రవాహంలో చిక్కుకుంది. అకస్మాత్తుగా పెరిగిన వరదతో కూలీలు ప్రమాదంలో పడ్డారు. అయితే, జేసీబి సహాయంతో కూలీలందరినీ సురక్షితంగా గోదావరి పాయ దాటించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



