తెలంగాణ

హైదరాబాద్‌ను వణికించిన వాన.. అంతలాకుతలమైన నగరం

Hyderabad: నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్‌‌ను వణికించింది. భారీ వర్షానికి నగరం అంతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి నాలాలు, రోడ్లపై వరద ఉప్పొంగింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పలు ఏరియాల్లో వరద నీరు ఇండ్లలోకి వచ్చింది. భారీ వరదకు పలు చోట్ల బైకులు కొట్టుకుపోయాయి. కృష్ణానగర్, యూసఫ్‌గూడలో భారీగా వరద వచ్చి చేరింది. మెట్టుగూడ విజపురి కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button