జాతియం
ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 75వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని ప్రధాని మోడీ.. ఎక్స్‌లో పోస్టు చేశారు. థ్యాంక్యూ మై ఫ్రెండ్ అంటూ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత్-అమెరికా దేశాల మధ్య భాగస్వామాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ట్రంప్ చేస్తున్న కృషికి తమ మద్దతు ఉంటుందని మోడీ తెలిపారు.



