ఆంధ్ర ప్రదేశ్
మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం

రాష్ట్రంలో ఎక్కడ విపత్తులు వచ్చినా వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందుంటారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న మల్లికార్జున, శశికళలను మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని అనంతపురం రప్పించారని ఎమ్మెల్యే అన్నారు.
నేపాల్ నుంచి స్వగ్రామం చేరుకున్న అనంతపురం వాసులను మంత్రి పరామర్శించారు. క్షేమంగా వచ్చినందుకు వారికి మిఠాయిలు తినిపించారు. మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నేపాల్ అల్లర్ల నేపథ్యంలో తెలుగువారిని స్వస్థలాలకు రప్పించేందుకు నారా లోకేష్ అనంతపురంలో నిర్వహించిన ఎన్డీఏ బహిరంగ సభకు రాలేదని నేతలు గుర్తు చేశారు.



