తెలంగాణ
Ponnam Prabhakar: కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలు

Ponnam Prabhakar: కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్రం సరిపడా ఎరువుల సరఫరా చేయడం లేదని తెలిపారు. యూరియా తయారీ, సరఫరా బాధ్యత కేంద్రానిదేనన్నారు.
తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ కక్ష ఉంటే ఇంకో రకంగా తీర్చుకోవాలన్నారు. కానీ రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.



