తెలంగాణ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంపిణీ కేంద్రాల దగ్గర అన్నదాతలు బారులు తీరుతున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో చెప్పులను వరుసలో పెట్టి రైతులు ఆధార్ కార్డులు చేత పట్టుకుని ఎదురు చూస్తున్నారు. పంటలు ఎండిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. యూరియా పంపిణీలో లోపాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



