ఈనెల 9న వైఎస్సార్‌సీపీ ‘అన్నదాత పోరు’

Sajjala: మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 9వ తేదీన వైసీపీ అన్నదాత పోరు పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది. ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది. అన్నదాత పోరు పోస్టర్‌ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.
ఈ నెల తొమ్మిదవ తేదీన రైతుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం నిర్వహించాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల పిలుపునిచ్చారు. ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలలలో జగన్ చేసిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వం విధ్వంసం చేసిందని సజ్జల మండిపడ్డారు.
అరాచకం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో మాఫియా ముఠాలు నడుస్తున్నాయి. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు దొరకడం లేదని అన్నారు. ఎరువుల అక్రమ నిలువలు ఉంచి టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ఆరోపించారు.



