తెలంగాణ

Ganesh immersion: వినాయక నిమజ్జనంలో అపశృతి

Ganesh immersion: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గోదావరి నదిపై నుంచి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సమయంలో విగ్రహాంతో పాటు జారి నదిలో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడు రామగుండం అక్బర్ నగర్‌కు చెందిన రాజేష్‌గా గుర్తించారు.

విషయం తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్లు, బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అధికారులు రక్షణ చర్యలు ఏర్పాటు చేయకపోవడం వల్లే యువకుడు నదిలో పడి గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button